చైనాకు షాకిచ్చిన గూగుల్-2,500 యూట్యూబ్ ఛానల్స్ తొలగింపు
చైనాకు గూగుల్ కూడా షాకిచ్చింది. ఇప్పటికే భారత్-అమెరికా దేశాలు చైనా యాప్‌లపై కొరడా ఝుళిపిస్తున్న తరుణంలో చైనాకు గూగుల్ షాకిచ్చింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఫేక్ ఇన్ఫర్మేషన్ తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ చానెల్స్‌పై దృష్టి సారించింది. చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది.
వీటిని ఏప్రిల్ - జూన్ మధ్య తొలగించినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా వీటి తొలగింపు చోటు చేసుకుంది.
అయితే కరోనా తర్వాత చైనా యాప్స్, యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది. దీనిపై స్పందించాలని కోరగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెంటనే రెస్పాండ్ కాలేదని సమాచారం.