శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (20:39 IST)

నొప్పి లేకుండా ఎలా చనిపోవాలని సుశాంత్ రాజ్‌పుత్ గూగుల్‌లో వెతికాడట!?

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని పలు వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది. పలు కోణాల్లో ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పాల్పడ్డాడు.. అనేందుకు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
విచారణలో భాగంగా సుశాంత్ వాడిన సిమ్ కార్డులను పోలీసులు సీజ్ చేశారు. అలా సుశాంత్ వాడిన సిమ్ కార్డులు ఆయన పేరు మీద లేనట్లు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం నొప్పిలేకుండా చనిపోవడం ఎలాగోనని సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేశాడని ముంబై పోలీసులు తెలిపారు. 
 
ఇంకా ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ బ్రావో ఈ కేసుపై మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయేందుకు రెండు గంటల ముందు తన పేరు మీద గూగుల్‌లో శోధించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయేందుకు ఐదు రోజుల ముందు.. ఆయన మాజీ మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య ఘటనపై ఎలా వార్తలు వచ్చాయని వెతికాడు. ఏయే వార్తల్లో తన పేరుందని చూశాడు. అన్నీ ఆర్టికల్స్ చదివాక.. చివరికి నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? మానసిక ఒత్తిడి సమస్యలను అధిగమించడం ఎలా అనే విషయాలపై వెతికాడు.
 
అలాగే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆయన కుటుంబంతో వివాదం వుందని సంజయ్ తెలిపారు. ఇప్పటివరకు రెండుసార్లు రియా వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సంజయ్ బ్రావో తెలిపారు.