ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (11:37 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే.. ఆ డాక్యుమెంట్ చూస్తే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ముమ్మాటికీ హత్యే. అది ఆత్మహత్య కాదు. అతని మెడపై ఉన్న ముద్రలు ఆత్మహత్య వల్ల ఏర్పడ్డవి కావు. హత్య వల్లే అలాంటి ముద్రలు ఏర్పడుతాయని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అందుకు గాను ఓ డాక్యుమెంట్ కూడా రుజువు చూపిస్తుందని చెబుతూ ఆయన సదరు డాక్యుమెంట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఆ డాక్యుమెంట్‌లో ఉన్న మొత్తం 26 పాయింట్లలో 24 పాయింట్లను బట్టి చూస్తే సుశాంత్ సింగ్‌ది హత్యేనని ఎవరైనా చెబుతారని తెలిపారు. కాగా ఆ డాక్యుమెంట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. సుశాంత్ సింగ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అతని మేనేజర్ దిశ సలియన్ ఆత్మహత్య చేసుకుందని, ఆమెకు సుశాంత్‌కు సంబంధించిన ఏదో ముఖ్యమైన విషయం తెలిసి ఉంటుందని, అందుకనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్వామి అన్నారు. తర్వాత సుశాంత్‌ను ఎవరో హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఉంది.