సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (15:13 IST)

భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలి: బీజేపీ ఎంపీ స్వామి

భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఇండోనేషియా కరెన్సీలా మన దేశ కరెన్సీ పైనా దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే మంచి జరుగుతుందని స్వామి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్య స్వామి.. భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్.. మన కరెన్సీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. 
 
ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని ప్రస్తావించిన స్వామి.. మన భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మపై ప్రధాని మోదీనే స్పందించాలన్నారు. అంతేకాదు నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని కూడా స్వామి పదే పదే మీడియా ప్రతినిధుల పక్షంలో కేంద్రానికి ఎత్తి చూపారు.