శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:53 IST)

'బిల్లా రంగా' రీమేక్ : నాడు మోహన్‌బాబు.. చిరంజీవి - నేడు సాయిధరమ్.. మంచు మనోజ్

సుమారు 35 యేళ్ళ క్రితం వచ్చిన చిత్రం "బిల్లా రంగా". ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, చిరంజీవిలు కలిసి నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అంశంపై మెగా - మంచు హీరోలు సమాయత్తమవుతున్నారు.

సుమారు 35 యేళ్ళ క్రితం వచ్చిన చిత్రం "బిల్లా రంగా". ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, చిరంజీవిలు కలిసి నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అంశంపై మెగా - మంచు హీరోలు సమాయత్తమవుతున్నారు. 
 
మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం 'గుంటూరోడు' ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన సాయిధరమ్ తేజ్... 'బిల్లా రంగా' రీమేక్ గురించి ప్రస్తావించడం... ఆ కథను డీల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నామని మంచు మనోజ్ చెప్పడంతో ఈ సినిమా రీమేక్ కోసం గ్రౌండ్ జరుగుతుందేమో అనే ప్రచారం సాగుతోంది.
 
మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించే మంచు మనోజ్... గతంలో అల్లు అర్జున్‌తో కలిసి 'వేదం' సినిమాలో నటించారు. ఇదిలావుంటే అప్పటి కథలో కొద్దిపాటి మార్పులు చేసి చిరంజీవి ప్లేస్‌లో సాయిధరమ్, మోహన్‌బాబు స్థానంలో మంచు మనోజ్ నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
కథలకు కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ప్రాజెక్టులు బాగానే వర్కవుట్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. మరి చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ అయిన సాయధరమ్, మనోజ్ కలిసి బిల్లా రంగాగా వెండితెరపై కనిపిస్తారేమో చూద్ధాం.