మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (13:44 IST)

కబాలిలో రజనీ నటన అదుర్స్.. 25 ఏళ్ల తర్వాత భార్యను చూసే సీన్‌లో దుమ్మురేపారు: చిరంజీవి

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపుదిద్దుకున్న కబాలి సినిమాపై ఓ వైపు కలెక్షన్ల వర్షం కురుస్తుంటే.. మరోవైపు ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినా.. రజనీకాంత్ మేనియాతో సినిమాకు క

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపుదిద్దుకున్న కబాలి సినిమాపై ఓ వైపు కలెక్షన్ల వర్షం కురుస్తుంటే.. మరోవైపు ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినా.. రజనీకాంత్ మేనియాతో సినిమాకు కలెక్షన్లు కురుస్తున్నాయి. తాజాగా కబాలికి మెగాస్టార్ చిరంజీవి కితాబిచ్చారు. రజనీకాంత్, చిరంజీవి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. సినీ కెరీర్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. 
 
ఈ నేపథ్యంలో కబాలి రిలీజ్ కావడంతో చిరంజీవి కోరిక మేరకు హైదరాబాద్‌లో ఆయన స్పెషల్ షో ఏర్పాటు చేశారు. స్పెషల్ షో చూసినా.. రెండోసారి కబాలి సినిమాను చిరంజీవి చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రజనీకాంత్‌ను ఇలాంటి పాత్రలో చూసేందుకు ఆశ్చర్యంగా ఉందన్నారు. 
 
కబాలి సినిమాలో 25 సంవత్సరాల తర్వాత తన భార్యను ఆయన చూసేటప్పుడు.. రజనీ యాక్టింగ్ అదుర్స్ అని కొనియాడారు. కబాలిలోని ఆయన స్టయిల్, నటన ఇంకా కళ్ళల్లోనే ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. త్వరలో మళ్లీ కబాలిని చూస్తానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి 150వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.