అన్నయ్య ''కత్తి'' పట్టేదెప్పుడు.. చిరంజీవి 150వ సినిమాపై మెగా ఫ్యాన్స్!
కత్తిలాంటోడు సినిమాను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అన్నయ్య సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కత్తి సినిమా షూటింగ్ జూన్ 20వ తేదీన ప్రారంభించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 'కత్తిలాంటోడు' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమా.. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. కానీ చిరంజీవి సినిమా షూటింగ్ జూన్ 20 తేదీనైనా ప్రారంభమవుతుందో లేదో అనే అనుమానంలో ఫ్యాన్స్ ఉన్నారు.
చిరంజీవి సరసన నటించేందుకు ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను వీవీ పరిశీలించారు. అయితే చిరు హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇకపోతే.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.