బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (14:27 IST)

'ఆచార్య' ప్రాజెక్టులపై క్లారిటీ - తమిళ దర్శకుడుకి ఛాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్, అంజలితో పాటు.. మరో హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే చిత్రాలపై ఇపుడు క్లారిటీ వచ్చింది. 
 
ఇప్పటికే, మ‌ల‌యాళ రీమేక్ 'లూసిఫ‌ర్', త‌మిళ రీమేక్ 'వేదాళం' చిత్రాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే, ఏ చిత్రం మొద‌ట సెట్స్ పైకి వెళ్తుంద‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు డైలామా కొనసాగుతూ వచ్చింది. ఇపుడు దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం 'లూసిఫ‌ర్' మొద‌ట సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ట‌. త‌మిళ ఇండ‌స్ట్రీలో రీమేక్ స్పెష‌లిస్టుగా పేరుగాంచిన మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకు మోహ‌న్ రాజా అయితే ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుందని చిరు ఫిక్స‌యిన‌ట్టు టాక్‌. 
 
పైగా, 'ఆచార్య' షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే జ‌న‌వ‌రి నుంచి 'లూసిఫ‌ర్' సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిరంజీవి టీం రెడీ అవుతుంద‌ట‌. 'లూసిఫ‌ర్' పూర్త‌యిన త‌ర్వాత మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్‌ చేయ‌బోయే వేదాల‌మ్ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు. 2020లో అభిమానుల‌ను నిరాశ‌ప‌ర్చిన చిరంజీవి వ‌చ్చే ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల‌తో ఫ్యాన్సుకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు.