గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (16:18 IST)

హైదరాబాద్‌కు వచ్చిన సోనూ సూద్.. చూసేందుకు ఎగబడిన స్థానికులు!

కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరి కంటికి ఆపద్బాంధవుడుగా కనిపించిన వెండితెర విలన్, రియల్ హీరో సోనూ సూద్. ఈయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆయన్ను చూసేందుకు క్యూ కట్టారు. వారిని అదుపు చేయడం సోనూ సూద్ ప్రైవేట్ సెక్యూరిటీతరం కాలేదు. అసలు సోనూ సూద్ ఉన్నట్టుండి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారో ఓ సారి తెలుసుకుందాం. 
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఈ మూవీలో సోనూ సూద్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగులో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున సెట్స్ వద్దకు తరలివచ్చారు. కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సోనూ సూద్... వాహనం నుంచి వెలుపలికి వచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. సోనూను చూడగానే అక్కడున్నవారందరూ హర్షం వ్యక్తం చేశారు. తమ ఫోన్లలో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ కుటుంబంతో సోనూ.. కారవాన్‌లోకి పిలిచి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.