గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (15:15 IST)

అరుదైన రుగ్మతతో బాధపడుతున్న సమంత... చిరంజీవి ఓదార్పు

samantha  - chiru
టాలీవుడ్ హీరోయిన్ సమంత అరుదైనరుగ్మతతో బాధపడుతున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సమంత నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ఓ సందేశం వెల్లడించారు. డియర్ సామ్ అంటూ చిరు ట్వీట్ చేశారు. 
 
"మన జీవితాల్లో ఎప్పటికపుడు సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని సత్తాని వెలికితీయడానిక ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్‌ను కూడా నువ్వు అధిగమించగలవని నేను ఖచ్చితంగా చెప్పగలను. త్వరలోనే నువ్వు మామూలు మనిషివి అవుతారు. ఈ కష్ట సమయంలో నీకు ధైర్యం, దృఢవిశ్వాసం కలగాలని కోరుకుంటున్నాను. ఆ దేవశక్తి కూడా నీ వెంటే ఉంటుందని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.