శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (13:34 IST)

శాండిల్ వుడ్ నుంచి రష్మికను వెలివేస్తారా? ధోనీ రనౌట్‌పై ఏం చెప్పిందంటే?

కన్నడ భాషలో సరిగ్గా డబ్బింగ్ చెప్పడం కష్టమని గీత గోవిందం హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి. రష్మిక వ్యాఖ్యలపై భాషాభిమానులు మండిపడుతున్నారు.


కన్నడ ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె... తన మాతృభాషను మాట్లాడలేకపోవడమేంటని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై రష్మికకు సమన్లు జారీ చేస్తామని వాణిజ్య మండలి ఛైర్‌పర్సన్ జయరాజ్ తెలిపారు. 
 
రష్మిక కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుంచి ఆమెపై కన్నడ సినీ పరిశ్రమ గుర్రుగా వుందని టాక్ వస్తోంది. తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ కన్నడ చిత్రసీమలోడియర్ కామ్రేడ్‌పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని సోషల్ మీడియాలో రష్మిక ఫొటోలు రిలీజ్ చేయట్లేదనే రూమర్ వినిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచీ ఆమెను తొలగించాలంటూ రోజురోజుకూ ఆందోళనలు పెరుగుతున్నాయి.  శాండల్‌వుడ్ నుంచీ ఆమెను తప్పించాలనీ, ఆమెపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. తనకు నటన రాదని చాలామంది విమర్శించారని చెప్పుకొచ్చింది. డియర్ కామ్రేడ్ ప్రమోషన్‌లో బిజీ బిజీగా వున్న ఈ భామ తనను విమర్శించిన వారికి తానేంటో చూపించానని చెప్పుకొచ్చింది.  
 
ప్రస్తుతం తాను నితిన్‌తో కలిసి ''భీష్మ'' సినిమాలో నటిస్తున్నాననీ, త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని రష్మిక చెప్పింది. స్టార్ హీరోలతో నటించే అవకాశం.. ప్రతిభకు లభించిన అవకాశంగానే భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.
 
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం గురించి రష్మిక మాట్లాడుతూ.. ఇందులో తాను క్రికెటర్‌గా నటిస్తున్నట్లు చెప్పింది. ఇందుకోసం  తాను క్రికెట్ నేర్చుకున్నట్లు తెలిపింది. 
 
ఇటీవల ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్‌ కావడం బాధ కలిగించింది. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే, మైదానంలో వేలాదిమంది సమక్షంలో ఆడేవాళ్లకు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు రష్మిక తెలిపింది. తనకు తెలుగు రాకపోయినా డబ్బింగ్ చెప్పుకున్నాననీ, అందుకు 60 రోజులు పట్టిందని పేర్కొంది.