శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (14:50 IST)

కుక్కకు భయపడి ఇంట్లో దూరితే... దొంగ అని కొట్టిచంపేశారు...

వీధి శునకానికి భయపడి ఓ ఇంట్లోకి దూరితే... ఓ పాదాచారిని దొంగ అని కొట్టి చంపేశారు. పీకల వరకు మద్యం సేవించి వస్తున్న వ్యక్తిని కుక్క వెంబడించడంతో అతను కుక్కకాటు నుంచి తప్పించుకునేందుకు ఓ ఇంట్లో దూరగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ వివరాలను పరిశీలిస్తే, బారాబంకీ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి, మద్యం తాగి, తన అత్తగారింటికి వెళుతుండగా, ఓ వీధికుక్క వెంటబడింది. దానిబారిన పడాల్సి వస్తుందన్న భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూరాడు. 
 
అప్పటికే అతను పూటుగా మద్యం తాగి ఉండటంతో, అతను విషయాన్ని విడమరచి చెప్పలేకపోయాడు. తమ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని భావించిన ఇంట్లోని వారంతా ఏకమై, అతన్ని పట్టుకుని కట్టేసి తీవ్రంగా చావబాది, ఇనుపచువ్వలతో కాల్చి చిత్ర హింసలు పెడుతూ కిరాతకంగా హతమార్చారు. 
 
ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.