శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (10:41 IST)

ఫేస్‌‌బుక్ ఫ్రెండ్స్‌ని ఇంటికి రమ్మంటాడు.. వచ్చాక ఉల్లాసంగా వుంటాడు.. ఆపై చంపేస్తాడు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌‌బుక్ ద్వారా పరిచయం అయిన యువతులపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చే సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలో నుంబి అనే గ్రామంలో జూలియస్ అనే యువకుని ఇంట్లో మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టి వుండటం సంచలనం రేపింది. 
 
గత వారం ఓ యువతి కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో ఆ యువతి  జూలియస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లినట్లు తేలింది. జూలియస్‌కు ఆ యువతి ఫేస్ బుక్ ఫ్రెండ్. జూలియస్ ఇంటికి పిలవడంతో అతని ఇంటికి వెళ్లింది. అలా ఇంటికొచ్చిన యువతిని లొంగదీసుకున్న జూలియస్.. ఆమెతో శారీరకంగా కలిశాడు. 
 
ఆ యువతి కూడా అతనిని ఇష్టపడింది. ఆపై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో జూలియస్ ఆ యువతిని హతమార్చి తన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో సైకో కిల్లర్ అని తేలిన జూలియస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను నలుగురు ఫేస్‌‌బుక్ ఫ్రెండ్స్‌ను ఇంటికి రప్పించి.. వారితో ఉల్లాసంగా వుండి.. హతమార్చుతాడని ఒప్పుకున్నాడు. అతని ఇంటి పరిసరాల్లో ఆ నలుగురు యువతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపారు.