సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (19:10 IST)

ముగ్గురు భార్యలతో ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ మధ్యలోనే?

ముగ్గురమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ ఊపిరి కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మపురిలోని నేచురల్స్ సలూన్‌లో పనిచేస్తున్న రాజా (30) తన మామ కుమార్తె సంధ్యను మొదటి వివాహం చేసుకున్నాడు. 
 
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ నేపథ్యంలో రాజాను తేనికి బదిలీ చేశారు. అక్కడికి వెళ్లిన రాజా.. ధనలక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇలా మరొక ఊరికి బదిలీ అయిన రాజా.. అక్కడ కావ్య (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని మరిచి ఇద్దరు మహిళలను రాజా పెళ్లాడాడు. ఇలా ఇద్దరు భార్యలతో ఉల్లాసంగా గడిపాడు. నాలుగోసారి పుదుచ్చేరికి బదిలీ అయిన రాజా కావ్యతో ఉల్లాసంగా గడిపాడు. కానీ రెండో భార్య ధనలక్ష్మికి పుదుచ్చేరికి రమ్మని పిలిచాడు. 
 
కానీ ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో రాజా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి భర్త చనిపోయిన వార్త విని ముగ్గురు భార్యలు పుదుచ్చేరి లాడ్జికి వచ్చి చూశారు. దీంతో పోలీసులు షాకయ్యారు. రాజాకు ముగ్గురు భార్యలున్న సంగతి అప్పుడే అందరికీ తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.