శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:12 IST)

మరిదిని చంపేసిన పోలీసులు.. వదినపై అకృత్యానికి పాల్పడ్డారు... ఎందుకు?

లాకప్ డెత్‌ను కళ్లారా చూసిన ఓ మహిళపై రాజస్థాన్ పోలీసులు అకృత్యానికి పాల్పడ్డారు. మహిళను దారుణంగా హింసించిన పోలీసులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చిరు జిల్లా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేమిచంద్ (22) అనే వ్యక్తి దొంగతనం చేసి అరెస్టయ్యాడు. ఈ నెల 6న అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు నిందితుడి వదినను కూడా అదుపులోకి తీసుకున్నారు.  
 
విచారణ పేరుతో నేమిచంద్‌ను తీవ్రంగా హింసించడంతో పాటు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు. నేమిచంద్ వదిన కళ్ల ముందే చనిపోవడంతో పోలీసుల దృష్టి ఆమెపై పడింది. ఆమె నేమిచంద్ లాకప్ డెత్‌ను బయటికి చెప్పేస్తుందనే భయంతో.. ఆమెను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేశారు. 
 
కను రెప్పలు కూడా తెరవలేనంత తీవ్రంగా కొట్టారు. నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై కేసులు నమోదయ్యాయి.