శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : సోమవారం, 22 జులై 2019 (21:34 IST)

అలా నాకు సంతృప్తి కలిగితేనే ఒప్పుకుంటానంటున్న రష్మిక మందన

స్వభాష కన్నడ కన్నా తెలుగులోనే రష్మిక  మందనకు మంచి పేరొచ్చింది. రెండే సినిమాలు.. ఒకటి ఛలో.. మరొకటి గీత గోవిందం. ఈ సినిమాలు కాస్త రష్మికకు అమాంతం మంచి పేరు తెచ్చిపెట్టాయి. యువ హీరోయిన్లలో రష్మికను అగ్రస్థానంలో నిలబెట్టింది.
 
తాజాగా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించిన డియర్ కామ్రేడ్ ఈ నెల 26వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కూడా రష్మిక ఆశలు పెట్టుకుంది. రెండు సినిమాలు తనకు ఏ విధంగా మైలేజ్ ఇచ్చాయో.. ఈ సినిమా కూడా అదేవిధంగా తన క్రేజ్‌ను పెంచుతుందన్న నమ్మకంలో ఉంది రష్మిక.
 
అయితే రష్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీపరిశ్రమలో చర్చకు దారితీస్తోంది. 2017 సంవత్సరంలో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగి రష్మిక పెళ్ళి ఆగిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత రష్మిక పెళ్ళి చేసుకోవాలని చూస్తోంది. అది కూడా కొన్ని క్వాలిటీలు ఉన్న వారిని మాత్రమే. భర్త అంటే నన్ను బాగా చూసుకోవాలి.. అడిగింది కొనివ్వాలని కాదు.. నన్ను పెళ్ళి చేసుకున్న తరువాత నాతో పాటు ఎక్కువ సేపు గడపాలి. ఇంటిలోనే ఎక్కువ సేపు ఉండాలి. 
 
పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండాలి. షికారుకు తీసుకెళ్ళాలి. ఇలా నన్ను అన్ని విధాలుగా సంతృప్తి పరిచే వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానంటోంది రష్మిక. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నానని చెబుతోంది. సినీ రంగమే కాదు ఏ రంగంలోనున్న వ్యక్త అయినా ఫర్వాలేదు. నాకు సంతృప్తి కలగాలంటోంది రష్మిక.