నేను భారీగా పెంచానా? మీకు ఎవరు చెప్పారు? రష్మిక మందన్నా

Last Updated: బుధవారం, 17 జులై 2019 (18:09 IST)
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా మండిపడ్డారు. తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. అసలు తాను పారితోషికం పెంచినట్టు మీకు ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు.

ప్రస్తుతం రష్మిక మందన్నా 'భీష్మ' చిత్రంతోపాటు ప్రిన్స్ మహేశ్ బాబు సరసన నాయకిగా 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమాలో నాయికగాను ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్మిక మందన్నా తన పారితోషికం బాగా పెంచేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

దీనిపై ఈ కన్నడ భామ స్పందించారు. 'నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల సక్సెస్ రేటును బట్టి.. క్రేజ్‌ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను.. ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :