సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (16:28 IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్లో ఫాన్స్‌కి...

టాలీవుడ్ ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్‌కు కరోనా సోకింది. తను ఇటీవల చేయించుకున్న పరీక్షలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నానని, తను ఆరోగ్యంగానే వున్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
తనకు కరోనా వచ్చిందని అభిమానులు కంగారు పడవద్దని అన్నారు. కరోనావైరస్ విజృంభిస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచన చేసారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టులు చేసుకోవాలని కోరారు. మొన్నామధ్యనే అల్లు అర్జున్ సైతం కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు.