ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (08:43 IST)

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయను చెన్నైకు తరలించి ఓ కార్పొరేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
ఆయనలో కరోనా లక్షణాలు వెలుగు చూడటంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి ఆదివారం పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
 
దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాగా, శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ కూడా పాల్గొన్నారు.