స్టాలిన్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో విశాల్‌

with stalin visal team
ముర‌ళీకృష్ణ‌| Last Updated: ఆదివారం, 9 మే 2021 (21:03 IST)
with stalin visal team
తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన‌ సంద‌ర్భంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను మ‌రియు ఎమ్మెల్యేగా గెలిచిన సంద‌ర్భంగా అత‌ని కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి హీరో విశాల్, అత‌ని స్నేహితుడు ర‌మ‌ణ శాలువాతో స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

visal with stalin, udayanidhi
visal with stalin, udayanidhi
అయితే ఈ సంద‌ర్భంగా సినిమా రంగంపై ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం విశాల్ న‌డిగ‌ర్ సంఘం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. పైగా దానికి సంబంధించిన బిల్డింగ్ క‌ట్టే ప‌నిలో కూడా వున్నారు. నాజ‌ర్ వంటి సీనియ‌ర్ న‌టులు కూడా ఈ ప‌నికి వెన్నంటి వున్నారు. ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ సినిమా రంగానికి ఏవైనా చేయాల్సిన‌వి చేయ‌గ‌ల‌రేమో చూడాల్సిందే. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డాయి. కార్మికుల‌కు ప‌నిలేదు. దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని కార్మికులు ఎదురుచూస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :