శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (11:43 IST)

శ్రీరెడ్డి నుంచి నాకు ప్రాణహాని వుంది: డ్యాన్స్ మాస్టర్ రాకేశ్

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిగా శ్రీరెడ్డి కూడా కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
ఇది జరిగి మూడు రోజులైనా కాకముందే ఇప్పుడు రాకేశ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డ్యాన్స్ మాస్టర్ ఎస్. రామారావు అలియాస్ రాకేశ్ (49) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సినీ నటి శ్రీరెడ్డి, ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని యూట్యూబ్, ఫేస్‍‌బుక్ ద్వారా బెదిరిస్తున్నారంటూ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు అపార్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అభిమాన సంఘం పేరుతో తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో వేధిస్తున్నారన్నారు. మూడు రోజుల్లో తనను చంపుతామని మరికొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.