గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (17:01 IST)

ఉగాదికి దాస్ కా ధమ్కీ తో వస్తున్నా..హిట్ కొడుతున్నా: విశ్వక్ సేన్

Vishwak Sen, Gangula Kamalakar, Karate Raju
Vishwak Sen, Gangula Kamalakar, Karate Raju
విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్‌బస్టర్‌ గా నిలిచాయి. గతంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 1.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’  2.0 ట్రైలర్‌ ను మంత్రి గంగుల కమలాకర్ లాంచ్ చేశారు.  
 
విశ్వక్ సేన్ ఫార్మా సీఈఓగా సూపర్ కూల్‌ గా కనిపించాడు. వెయిటర్‌ పాత్రలో మాస్‌ గా అలరించాడు. రెండూ అద్భుతంగా చేశాడు. నివేదా పేతురాజ్ విశ్వక్ ప్రేయసిగా అందంగా,  ' కనిపించింది. వారి కెమిస్ట్రీని ఆకట్టుకుంది. అలాగే లవ్ ట్రాక్‌ లో మంచి హ్యుమర్ ఉంది.
 
 విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కి మధ్య ఒక కేటగిరీ వుంటుంది. ఒక డ్రైవర్, డెలివరీ బాయ్, వెయిటర్.. వీళ్ళని ఏ మాత్రం అలోచించకుండా ఒక మాట అనేస్తాం. అదే లోయర్ మిడిల్ క్లాస్ వోడు తిరిగి దేబ్బెస్తే ఎలా వుంటుందో సినిమాగా తీశాం. అదే ధమ్కీ. సినిమా ఉగాది రోజు విడుదలౌతుంది. ఉగాది పచ్చడిలానే వుంటుంది. థియేటర్ లో పచ్చడి పచ్చడి చేస్తా. ఫస్ట్ హాఫ్ అంతా డ్యాన్స్ లు ఫైట్లు ఎంటర్ టైన్ మెంట్ అన్నీ బావుంటాయి. ఇంటర్ వెల్ లో కిందా మీద ప్యాక్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఛాతిలో చిన్న బరువు స్టార్ట్ అవుతుంది మెల్లగా చెమటలు వస్తాయి. హార్ట్ బీట్ వెనక ముందు అయితది. ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇది ట్రైలర్ 2.0 మాత్రమే కాదు.. ఇది విశ్వక్ సేన్ 2.0. 17న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఆస్కార్ ఈవెంట్ నుంచి నేరుగా మా ఈవెంట్ కి వస్తున్నారు. తారక్ అన్న అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేశారు. చాలా గర్వంగా వుంది. ఉగాది 22 బుధవారం సినిమా విడుదలౌతుంది. డౌట్ వున్న వాడు ఎవడూ సినిమాని బుధవారం విడుదల చేయడు. నేను పూర్తి నమ్మకంతో దమ్ముతో చెబుతున్నా. వస్తున్నా కొడుతున్న.. ఇది విశ్వక్ సేన్ 2.0. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.