1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (20:33 IST)

దిల్ రాజు- వైఘారెడ్డి పండంటి మగబిడ్డ పేరేంటో తెలుసా?

Dil Raju
ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు.. రెండో భార్య పేరు వైఘారెడ్డి కాగా కొన్నిరోజుల క్రితం వైఘారెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దిల్ రాజు కొడుకుకు అన్వై రెడ్డి అని నామకరణం చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 
 
తన మొదటి భార్య పేరులోని మొదటి అక్షరం అ, రెండో భార్య పేరులోని మొదటి అక్షరం వై కలిసేలా దిల్ రాజు ఈ పేరును ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. కొడుకు పుట్టడంతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
మరోవైపు దిల్ రాజు ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్‌గా పలు భారీ బడ్జెట్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఎఫ్3 సినిమాతో నిర్మాతగా కూడా విజయం సొంతమైంది. 
 
మరికొన్ని రోజుల్లో దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన థాంక్యూ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.