మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (17:02 IST)

ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత

NSR Prasad
NSR Prasad
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సీతారామ్‌గా ఆయన ఇండస్ట్రీకి సుపరిచితులు. ఆర్యన్ రాజేశ్ హీరోగా రామానాయుడు నిర్మించిన నిరీక్షణ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 
 
ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా శత్రువు, నవదీప్ హీరోగా నటుడు వంటి సినిమాలు తెరకెక్కాయి. ఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. అయితే 49 ఏళ్ళ వయసులోనే డైరెక్టర్ సీతారామ్ ప్రసాద్ కన్నుమూయడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.