శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జులై 2023 (13:32 IST)

పాన్ ఇండియా మూవీలో మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు ఎవరు?

Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కుర్రహీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్టులు సిద్ధంగా ఉండగా, వచ్చే నెలలో ఆయన నటించిన "భోళాశంకర్" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే? చిరంజీవి పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడంట. 
 
"బింభిసార" సినిమా డైరెక్టర్ వశిష్టతో చిరు మూవీ చేస్తున్నాడంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ్ కృష్ణతో చేసే సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. అయితే వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కే సినిమా మాత్రం ఫుల్ టు ఫుల్ సోషియో ఫాంటసీ మూవీగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ మొత్తం డైరెక్టర్ చిరంజీవికి దర్శకుడు వివరించారని, దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలన్న భావనలో ఉన్నట్టు సమాచారం.