ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (20:27 IST)

ప్రభాస్ ప్రాజెక్ట్ K నుంచి దిశా పటాని ప్రీ లుక్

Disha Patani pre look
Disha Patani pre look
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. షూటింగ్ ప్రారంభించే ముందు టీమ్ యూనిక్ ప్రమోషన్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రమ్ స్క్రాచ్ అనే ప్రీ-ప్రొడక్షన్ పనుల వీడియోలను విడుదల చేశారు. నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రీ-లుక్ పోస్టర్‌లను కూడా రివిల్ చేశారు
 
ఇదివరకే ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ల ప్రీ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నిన్న పుట్టినరోజు జరుపుకున్న నటి దిశా పటానీ ప్రీ లుక్ పోస్టర్‌ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రీలుక్ పోస్టర్ లో దిశా పటాని పెళ్లి కూతురు గెటప్‌లో నుదిటిపై పెళ్లి బొట్లుతో కనిపిస్తుంది. పోస్టర్‌ లో ఆమె పదునైన కళ్ళు చూడవచ్చు.
 
దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది.
50 మెమరబుల్స్ ఇయర్స్ జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అశ్విని దత్ నిర్మాత.
ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.