రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసు, భార్య శిల్పా శెట్టి ఏమన్నదో తెలుసా?
భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్న తర్వాత నటి శిల్పా శెట్టి గురువారం రాత్రి తొలిసారిగా దీనిపై స్పందించారు. అశ్లీల చిత్ర నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆమె భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా తెలిపింది.
"మనం ఉండవలసిన స్థలం ఇక్కడే ఉంది, ప్రస్తుతం. ఏమి జరిగిందో, ఏదైనా కావచ్చు అనే దానిపై ఆత్రుతగా చూడటం లేదు, కానీ జరిగింది ఏమిటో పూర్తిగా తెలుసు". "నేను సజీవంగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. నేను గతంలో సవాళ్లను తట్టుకున్నాను, భవిష్యత్తులో సవాళ్లను తట్టుకుంటాను. జీవితంలో ఇవి మామూలే. "
సోమవారం, రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు, అశ్లీల చిత్రనిర్మాణం, వాటిని యాప్స్‌లో ప్రచురించడం వంటి కేసులో అతను "కీలక కుట్రదారుడు"గా అభియోగం నమోదైంది. రాజ్ కుంద్రాపై తగిన ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు. శిల్పా శెట్టి పాత్ర చురుకుగా లేదని దర్యాప్తులో తేలిందని వారు స్పష్టం చేశారు.