శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (11:15 IST)

తమ్ముడితో భార్యకు అక్రమం సంబంధం అంటగట్టిన భర్త..

అదనపు కట్నం కోసం ఓ బ్యాంకు మేనేజరు అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డాడు. తన తమ్ముడుకి కట్టుకున్న భార్యకు అక్రమ సంబంధం అంటగట్టాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ వివాహిత... ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఆదిలాబాద్ జిల్లా సీసీసీ నస్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని నాగార్జున కాలనీకి చెందిన దంసాని మమత (22) అనే మహిళకు నవీన్‌ కుమార్‌తో రెండేళ్ల క్రితం వివాహమైది. అయితే, భార్యను అదనపు కట్నం తీసుకునిరావాలంటూ భర్తతో పాటు.. అత్తింటివారు వేధించసాగారు. 
 
ఈ భార్యాభర్తలిద్దరితో పాటు నవీన్ కుమార్ తమ్ముడు వేణులు కలిసి ఒకే క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. పైగా, నవీన్‌ కుమార్‌ మంథనిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంటే, వేణుకు తండ్రి లింగయ్య ఉద్యోగం వారసత్వంగా వచ్చింది.
 
ఈ క్రమంలో నవీన్, వేణు, వారి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం మమతను వేధించసాగారు. అయినా కట్నం తీసుకురాకపోవడంతో మరిధి వేణుతో మమతకు వివాహేతర సంబంధం అంటగట్టారు. 
 
దీంతో మనస్తాపం చెందిన మమత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దంసాని స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.