1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. A domestic violence case can be filed against a wife who abuses her husband

భర్తను హింసించే భార్యపైనా గృహ హింస కేసు పెట్టొచ్చు

domestic violence case
భర్తను హింసించే భార్యపైనా గృహ హింస కేసు పెట్టొచ్చ‌ని ఢిల్లీ హైకోర్టు ప్ర‌క‌టించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ముందుకు ఓ పిటిషన్ వచ్చింది. దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గృహహింస చట్టంతో ఇక నుంచి మహిళలపై కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది.

‘భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు’ అనే పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక నుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. భర్తలు కూడా న్యాయం కోసం పోరాడవచ్చని తెలిపింది.
 
మహిళలపై రోజు రోజుకూ జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు 2006లో గృహ హింస నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. భర్తను వేధించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.
తర్వాతి కథనం
షర్మిల దీక్ష.... జనం లేని పర్యటన