శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా కోసం 70 పోర్నోగ్రఫీ వీడియోలు

rajkundra
ఠాగూర్| Last Updated: గురువారం, 22 జులై 2021 (13:45 IST)
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఓ పాడుపని చేశాడు. పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటికే ఆయన్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ముంబై పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, కుంద్రా ఆదేశాల మేర‌కు చిన్న సంస్థ‌లు 70 పోర్న్ వీడియోల‌ను రూపొందించిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపైనే పోలీసులు కూపీ లాగుతున్నారు. చిన్న త‌ర‌హా నిర్మాణ సంస్థ‌లు ఆ పోర్న్ వీడియోల‌ను షూట్ చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌న్నీ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ నిఘాలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇత‌ర‌ నిర్మాణ సంస్థ‌ల‌తో పాటు కుంద్రా ఓన‌ర్‌గా ఉన్న హాట్‌షాట్స్ యాప్ కోసం ప్ర‌త్యేకంగా 90 పోర్న్ వీడియోల‌ను రూపొందించారు. వీటిల్లో కొన్ని వీడియోలు 20 నుంచి 30 నిమిషాలు పైగా ఉంటాయ‌ని పోలీసులు వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

పోర్న్ రాకెట్‌ను న‌డిపిస్తున్న కేసులో ఇప్ప‌టికే 11 మందిని అరెస్టు చేశారు. రాజ్‌కుంద్రాపై 420 చీటింగ్‌, 34 కామ‌న్ ఇంటెన్ష‌న్‌, 292, 293 సెక్ష‌న్ల కింద కేసులు బుక్ చేశారు. మరోవైపు, తనకు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టుకు ఆశ్రయించారు.దీనిపై మరింత చదవండి :