మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:42 IST)

డొనాల్డ్ ట్రంపే నాకు ఆదర్శం, స్ఫూర్తి ఏ విషయంలో తెలుసా?: నాగార్జున

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే చాలు.. అందరికీ కోపం చిర్రెత్తుకొస్తుంది. అయితే టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున.. ట్రంప్ తనకు ఆదర్శమంటున్నాడు. ఇంతకీ ఏ విషయంలో ట్రంప్

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే చాలు.. అందరికీ కోపం చిర్రెత్తుకొస్తుంది. అయితే టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున.. ట్రంప్ తనకు ఆదర్శమంటున్నాడు. ఇంతకీ ఏ విషయంలో ట్రంప్ నాగార్జునకు ఆదర్శం అంటే.. అభిప్రాయాల వ్యక్తీకరణలో అంటున్నాడు. 
 
జనాలకు తనకు మధ్య ఎలాంటి గోడలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను సూటిగా జనాలకు తెలియజేశాడని.. అదే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి కారణమైందని నాగార్జున వ్యాఖ్యానించాడు. 
 
ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ స్ఫూర్తితో తాను కూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. మన గురించి ఎవరో చెప్పడం కన్నా.. మన సమాచారం సూటిగా జనాలకు మనమే చేరవేస్తే బాగుంటుందని నాగార్జున వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. 
 
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ భక్తిరస చిత్రంలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హాధీరామ్ బావాజీ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. అనుష్క, ప్రగ్యాజైస్వాల్ కథానాయికలుగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది.