ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:31 IST)

తెలుగు సినీ రచయిత - డబ్బింగ్ ఆర్టిస్ట్ - దర్శకుడు శ్రీరామకృష్ణ కన్నుమూత

sriramakrishna
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ దర్శకుడు శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. బొంబాయి, జెంటిల్‌మేన్, చంద్రముఖ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో పాటు.. సుమారుగా 300కు పైగా చిత్రాలకు ఆయన సినీ రచయితగా పని చేశారు. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం కూడా వహించారు. 
 
శ్రీరామకృష్ణ స్వస్థం గుంటూరు జిల్లా తెనాలి. అనువాద రచనలో రాజశ్రీ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్న శ్రీరామకృష్ణ... మణిరత్నం, శంకర్ వంటి దిగ్గజ దర్శకులు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు తెలుగులో మాటలు రాశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివదేవానికి మంగళవారం ఉదయం చెన్నై సాలిగ్రామంలోని శ్మాశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమన్ ఉన్నారు.