మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (18:17 IST)

జర్మన్ భామతో ప్రభాస్ ఫైట్

బాహుబలితో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ కెరీర్‌లో తదుపరి సినిమాగా, అతని కెరీర్‌లోని 19వ సినిమాగా తెరకెక్కుతున్న సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారతీయ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
 
సాహో సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు టీజర్‌లు విడుదలై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంతగా ఆకట్టుకుంటూ, ఇంత మంది ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
కాగా... ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే... ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ లీడ్ రోల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే అయినప్పుటికీ.. ఇండో జర్మన్ తార ఎవైలన్ శర్మ దీనిలో కీలక పాత్ర పోషిస్తోందట.  ఆమె పాత్రకు సంబంధించిన కీలక సమాచారం ఇటీవల బయటకు వచ్చింది.
 
ఎవైలన్ శర్మ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆవిడ గన్స్ పట్టుకొని ప్రభాస్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందట. మరి ఇన్ని భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకు వేచి ఉండవలసిందే...