ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (11:26 IST)

అమృత్ సర్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఫోటోల‌కోసం ఎగ‌బ‌డ్డ అభిమానులు

Fnas at university
Fnas at university
రామ్‌చ‌ర‌ణ్ ఇంత‌కుముందు సినిమాలు చేసినా ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత ఆయ‌న క్రేజ్ మారిపోయింది. దాదాపు నార్త్‌లోని ముఖ్య‌మైన న‌గ‌రాల‌లో రాజ‌మౌళి సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా చుట్టేశారు. దాంతో ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌కు క్రేజ్ తెగ వ‌చ్చేసింది. ఆ ఎఫెక్ట్ తాజాగా సోమ‌వారంనాడు చ‌ర‌ణ్‌కు క‌నిపించింది. త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేస్తున్నాడు. ఆర్‌.సి.15 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. 
 
అయితే ఇందులో రెండు పాత్ర‌లు పోషిస్తున్నాడ‌ని టాక్ నెల‌కొంది. ఇదిలా వుంటే ఈరోజు  ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమృత్ సర్ వ‌ద్ద‌ జరుగుతుంది.  ఏప్రిల్ 6 నుంచే అక్కడ షూటింగ్ జరుగుతుంది. కాగా, సోమ‌వారంనాడు తాజాగా సెట్స్ లో నుంచి చెర్రీ కొన్ని ఫొటోల‌ను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆయ‌న ఫొటోల కోసం ఎగ‌బ‌డుతున్న‌ట్లుంది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయి  వైరల్ చేసేస్తున్నారు.  ఇంత‌కీ ఇంత‌మంది రావ‌డానికి కార‌ణం అమృత్‌సర్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో షూట్ జ‌ర‌గ‌డ‌మే. ఇక హీరోయిన్ కియారా అద్వానీ న‌టిస్తోన్న ఈ సినిమాలో భారీ తారాగ‌ణం పాల్గొంది.  మే నెల‌లో వైజాగ్‌లో షూట్ జ‌ర‌గ‌నుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.