బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 24 జులై 2018 (21:10 IST)

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ బాగా ప్లాన్ చేసాడుగా.. జూ.ఎన్టీఆర్‌తో...

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే... అక్కినేని అఖిల్ న‌టించిన హ‌లో చిత్రంలో పాట ఈ మాయ పేరేమిటో గుర్తుంది క‌దా. ఈ పాట‌ను అఖిల్

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే... అక్కినేని అఖిల్ న‌టించిన హ‌లో చిత్రంలో పాట ఈ మాయ పేరేమిటో గుర్తుంది క‌దా. ఈ పాట‌ను అఖిల్ పాడిన విష‌యం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ పాట బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు ఇదే టైటిల్‌గా పెట్టుకుని రాహుల్ విజ‌య్ వ‌స్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల అక్కినేని నాగ చైత‌న్య రిలీజ్ చేసారు. 
 
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ నెల 28వ తేదీన ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే... ఈ ఆడియోను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాహుల్ విజయ్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ ప్ర‌మోష‌న్ బాగా ప్లాన్ చేసాడు. మ‌రి.. ఎంతవ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.