సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 24 జులై 2018 (19:38 IST)

గూఢ‌చారి ఇది నిజ‌మా..?

క్ష‌ణం సినిమాతో సెన్సేష‌న్ క్రియ‌ట్ చేసిన అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ గూఢ‌చారి. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడు శశికిరణ్ తిక్కా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు బ్ర‌హ్మాండ‌మైన‌

క్ష‌ణం సినిమాతో సెన్సేష‌న్ క్రియ‌ట్ చేసిన అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ గూఢ‌చారి. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడు శశికిరణ్ తిక్కా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు బ్ర‌హ్మాండ‌మైన‌ స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమా పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. తెలుగులో చాలా రేర్‌గా వ‌చ్చే స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు ఈ గూఢచారితో రీ-ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ నదియా ఖురేషీ పాత్రను పోషిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని 116 రోజుల్లో.. 168 డిఫరెంట్‌ లోకేషన్లలో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో చిత్రీకరించార‌ని చిత్ర యూనిట్ తెలియ‌చేసారు. ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభిత ధూళిపాళ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
116 రోజుల్లో.. 168 లోకేష‌న్స్‌లో ఈ సినిమాని చిత్రీకరించారంటే.. ఈ చిత్ర క‌థపై ఎంత న‌మ్మ‌కం ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. క్ష‌ణం చిత్రానికి అందించిన‌ట్టే అడివి శేష్ ఈ చిత్రానికి కూడా క‌థ‌ను అందించ‌డం విశేషం. మ‌రి.. గూఢ‌చారి ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో తెలియాలంటే ఆగ‌ష్టు 3 వ‌ర‌కు ఆగాల్సిందే.