గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (12:08 IST)

"సిటాడెల్" తొలికాపీ.. ఫోటోలు వైరల్.. సమంత కంటికి ఏం పవరబ్బా?

Samantha
Samantha
ప్రియాంక చోప్రా- గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు రిచర్డ్ మాడెన్ నటించిన హాలీవుడ్ సిరీస్.. స్పిన్-ఆఫ్ అయిన సిటాడెల్ వెబ్ సిరీస్ భారతీయ వెర్షన్ షూటింగ్ చాలా కాలం క్రితం ప్రారంభమైంది. రాజ్ అండ్ డీకే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 
 
ఈ సిరీస్ విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో, సమంత ఇప్పుడు వరుణ్, రాజ్, డీకేతో సహా తన గ్యాంగ్  చిత్రాలను పంచుకుంది. 
 
22 నెలల పాటు అంకితభావంతో పని చేసిన సమంత ఎట్టకేలకు 'సిటాడెల్' మొదటి కాపీపై దృష్టి సారించినట్లు ఈ ఫోటోల ద్వారా కనిపిస్తోంది. ఇటీవలే తన డబ్బింగ్ పూర్తి చేసిన టాప్ సైరన్, ల్యాప్‌టాప్‌లో వీక్షిస్తున్న టీమ్‌తో తీసుకున్న చిత్రాలను పంచుకుంది. 
 
"సిటాడెల్" హాలీవుడ్ వెర్షన్ ఆశించినంతగా గుర్తింపు పొందకపోయినప్పటికీ, ఇండియన్ వెర్షన్ తప్పకుండా భారతీయ అభిమానులను ఆకట్టుకుంటుందని సినీ పండితులు భావిస్తున్నారు.