ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అప్పటివరకు "గదర్-2" కోసం వేచి చూడాల్సిందే..

gadar-2 movie
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్-2. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.450 కోట్ల వసూళ్ళను రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు తగ్గలేదు. 
 
ఈ క్రమంలో ఈ చిత్రం ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందా అని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఒక చిత్రం విడుదలైన రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా గదర్-2 కూడా స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. 
 
'ప్రస్తుతం ప్రేక్షకులు "గదర్‌-2" థియేటర్‌లో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఒరవడి ఇంకొన్ని రోజులు కొనసాగుతుంది. నాకు తెలిసినంత వరకూ మరో ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకూ సినిమాను థియేటర్‌లోనే చూస్తారని అనుకుంటున్నా. ప్రేక్షకులు చూపిస్తున్న ఉత్సాహమే మా సినిమాకు అతిపెద్ద విజయం" అని చెప్పుకొచ్చారు.