1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (11:34 IST)

పంచభూతాల సాక్షిగా మెగా 157 ప్రాజెక్టుపై క్లారిటీ .. వశిష్ట దర్శకత్వంలో

mega 157 project
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, ఆయన కొత్తగా నటించే ప్రాజెక్టుల వివరాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులోభాగంగా, చిరంజీవి నటించే "మెగా 157" ప్రాజెక్టు వివరాలను అధికారికంగా ప్రకటించారు. వశిష్ట దర్శకత్వం వహించే ఈ ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ బ్యానరుపై నిర్మించనున్నారు. పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని.. వీటిని నియంత్రించే శక్తితో రూపొందించిన ఒక ఇమేజ్‌ను రిలీజ్ చేశారు. ఫాంటసీ జోనర్‌లో నిర్మితమయ్యే ఈ చిత్రానికి వశిష్ట కథను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల చిరంజీవి నటించిన "భోళాశంకర్" చిత్రం విడుదలకాగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇది తమిళ చిత్రానికి రీమేక్. అన్న, చెల్లి సెంటిమెంట్‌తో రూపొందగా, మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. కానీ, ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. అయినప్పటికీ చిరంజీవితో చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులోభాగంగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ మెగా 157 చిత్రాన్ని నిర్మించనుంది.