ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:49 IST)

చిరంజీవి ఆరోగ్యం కోసం శ్రీ వారాహి మహా యజ్ఞం

varahi yaznam
varahi yaznam
శ్రీ శివశంకర వర ప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి) జన్మదినోత్సవం ఆగెస్ట్ 22. ఇటీవలే ఆయన మోకాలికి గాయం అయింది. దానికి చిన్న చికిత్స అవసరం. అందుకే ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈనెల 21న జూబ్లీ హిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఆవరణలో శ్రీ వారాహి మహా యజ్ఞం & భగలాముఖి ఆరాధన జరుగుతుందని అఖిల భారత చిరంజీవి యువత ప్రకటనలో తెలిపినది. 
 
ప్రముఖ అమ్మవారి ఉపాసకులు  శ్రీ నవబాల జ్యోతిషాలయం వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మణ రావు గురూజీ గారు ఆశీర్వదిస్తూ శ్రీ చిరంజీవి గారు వారి కుటుంబ సభ్యులు  నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని సినీ వినీలాకాశంలో  చిరస్థాయిగా అగ్రస్థానంలో  నిలవాలని సహస్ర చంద్ర దర్శన శతవత్సర ఆయుష్షుని ప్రసాదించాలని కోరుతూ …
 
శ్రీ భగలా ముఖీ అమ్మవారు ,శ్రీ వారహి అమ్మవారి  ఆశీస్సులు శ్రీ చిరంజీవి గారికి కలగడం కోసం Aug 21 వ తేదీన  ఉదయం  8:01 ని II లకు  శ్రీ వారాహి మహా యజ్ఞం మరియు భాగలా ముఖి ఆరాధన  శ్రీ చిరంజీవి గారు,  శ్రీమతి సురేఖ గారు, &  శ్రీ రామ్ చరణ్ గారు, శ్రీమతి ఉపాసన గారు  పేరున మరియు కుటుంబ సభ్యుల గోత్రనామాల పేరున జరుపుటకు ప్రముఖ పండితులు నిశ్చయించారు .
 
శ్రీ చిరంజీవి గారికి  ఆయుష్షు ఐశ్వర్యం జన వశీకరణ మరియు కుటుంబంలో అందరూ సంతోషాలతో జీవనం జరగాలని అశేష నటనాపటిమతో అలరించాలని... అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన రాంచరణ్ గారు మరిన్ని ఉన్నత  శిఖరాలు అధిరోహించాలని...
 
కావున అశేష మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు 21 వ తేదీన ఉదయం  విచ్చేసి ఈ కార్యక్రమం కన్నుల విందుగా జరిపి *శ్రీ చిరంజీవి గారు వారి కుటుంబసభ్యులు శత ఆయుష్షుని పొందాలని ఆ భగవంతుడుని ప్రార్థిద్దాo ! అని తెలిపారు.