సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (18:14 IST)

'మిస్టర్ ప్రెగ్నెంట్' బాగుంది.. 200 మంది మహిళలు భేష్ అన్నారు..

Mr. Pregnant,
బిగ్ బాస్‌తో పాపులారిటీ సంపాదించిన సయ్యద్ సోహెల్ ర్యాన్ 'మిస్టర్ ప్రెగ్నెంట్'లో ప్రధాన పాత్ర పోషించాడు. చిత్రనిర్మాతలు తమ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎంపిక చేసిన ప్రేక్షకుల కోసం ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.
 
ఈ చిత్రం ఆగస్ట్ 18 శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. అయితే నిర్మాతలు అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి 200 మంది గర్భిణీలకు స్పెషల్ షో వేశారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
 
 ఈ సినిమాను వీక్షించిన మహిళలు సానుకూలంగా స్పందించారు. ఇది మేకర్స్ నమ్మకాన్ని మరింత పెంచింది. గర్భిణీ స్త్రీలు అందరూ సినిమాలోని సబ్జెక్ట్‌ని ఆస్వాదించారని అంగీకరించారు.