1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (10:27 IST)

ముక్కోణపు ప్రేమ : ఒకేసారి ఇద్దరు యువకులతో యువతి ప్రేమ!!

Love
ఏపీలోని విశాఖపట్టణంలో ఓ ముక్కోణపు ప్రేమ కలకలం రేపింది. ఓ యువతి ఒకేసారి ఇద్దరి యువకులతో ప్రేమాయణం జరిపింది. గోపాలపట్నానికి చెందిన ఓ యువతి.. ఇద్దరు యువకులను ప్రేమించి.. వారిలో ఒక యువకుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా మరో ప్రియుడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను నిలదీశాడు. పైగా, ఇద్దరు ప్రేమికులు ఆమెను మందలించి, తామిద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలంటూ పంచాయతీ పెట్టారు. 
 
ఈ వ్యవహారమంతా అత్తారింటిలో తెలిసిపోవడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రియుడు... రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.