మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (10:53 IST)

ప్రేమ విఫలం - విశాఖలో టెక్కీ ఆత్మహత్య

suicide
ప్రేమ విఫలం కావడంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన విశాఖలో జరిగింది. స్థానికంగా ఉండే శంకరమఠంలో పని చేసే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ప్రేమ విఫలం కావడం అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పి.రాంప్రసాద్ (30) అనే కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంల ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సీతంపేట ప్రాంతంలోని గణేశ్‌ నగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అయితే, నిన్న ఉదయం తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు ద్వారకా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించగా వారికి సూసైడ్ నోట్ దొరికింది. ప్రేమ విఫలమవుతుందనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ధర్మేద్ర తెలిపారు.