ఐఐటీ-హెచ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఎంటెక్ విద్యార్థి
హైదారాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ-హెచ్‌లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని భరించలేక సోమవారం తన గదిలో ఉరేసుకుని ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. మానసిక ఒత్తిడిని భరించలేకపోతున్నానంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మృతుడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
ఈ విద్యా సంస్థలలో గత నెలలో ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడటం అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిసివేస్తుంది. మృతుడిని మమైత్ నాయక్‌గా గుర్తించారు. గత నెలలో కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఇపుడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
దీనిపై సంగారెడ్డి రూరల్ ఎస్ఐ స్పందిస్తూ, మమైత్ నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 26వ తేదీనే ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జిరగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గరువుతున్నా అని రాసిన సూసైడ్ లేఖను మమైత్ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.