సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (12:14 IST)

పెళ్ళిపీటలెక్కనున్న విశ్వక్‌సేన్.. వధువు ఎవరు?

vishwaksen
తెలుగు చిత్రపరిశ్రమలోని యంగ్ హీరోల్లో విశ్వక్‌సేన్ ఒకరు. ఈయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వధువు ఎవరన్నది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఆయన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే చిత్రంలో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి అంజలీ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో విశ్వక్‌సేన్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. లుంగీ కట్టులో ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంది. 
 
మరోవైపు, ఆయన వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఆదివారం చేసిన ట్వీట్ వైరల్ అయింది. "ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞుడిని. ఇపుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలుపెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా" అంటూ అబ్బాయి - అమ్మాయి ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీంతో విశ్వక్‌సేన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.