గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:45 IST)

దాస్ కా ధమ్కీ సీక్వెల్ చేస్తున్నాం

Vishwak Sen, Niveda Pethuraj
Vishwak Sen, Niveda Pethuraj
హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ ‘‘   ఐపీఎల్ నడుస్తున్నప్పటికీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చక్కగా చూస్తున్నారని ఆహా టీమ్ చెప్పటం చాలా థాంక్స్. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ రిపీటెడ్‌గా చూస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇక యాక్టర్‌గా చూస్తే గామి సినిమా చేస్తున్నాను. అలాగే డిసెంబర్ లోపు మూడు సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నాను. సీక్వెల్‌లో కంటిన్యూ ఉంటుంది. సీక్వెల్ పార్ట్ వన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది’’ అన్నారు. 
 
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ‘‘థియేటర్‌లో దాస్ కా ధమ్కీ చిత్రానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు ఆహాలొనూ అంతేలా వస్తుంది. బ్లడీ మేరీ తర్వాత ఆహా వారితో అసోసియేట్ అయిన రెండోసినిమా ఇది.  హీరోగా నటిస్తూనే  ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. మల్టి టాలెంటెడ్ సేన్ అని తెలిపారు.