ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (17:00 IST)

కమల్ హాసన్, రజనీకాంత్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్: గౌతమి

సినీ లెజండ్ కమల్ హాసన్ ఇటీవల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే సర్కారు అవినీతితో కూడుకున్నదని కమల్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కౌంటరివ్వడం జరిగింది. ఆపై మంత్రులకు కమల్ హాస

సినీ లెజండ్ కమల్ హాసన్ ఇటీవల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే సర్కారు అవినీతితో కూడుకున్నదని కమల్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కౌంటరివ్వడం జరిగింది. ఆపై మంత్రులకు కమల్ హాసన్‌ రీ కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ వస్తారా? వీరిలో ఎవరు ముందు రాజకీయాల్లోకి అడుగుపెడతారని తమిళ ప్రజలు కన్ఫ్యూజ్‌లో వున్నారు. 
 
ఇలాంటి తరుణంలో కమల్, రజనీ అరంగేట్రంపై కమల్ ‌నుంచి దూరమైన సినీనటి గౌతమి స్పందించింది. కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ముందు.. బాగా ఆలోచించుకోవలని చెప్పారు. మంచి, చెడు అన్నీ రంగాల్లో వుంటాయి. తప్పు చేసేవారు, తప్పు చేయని వారు పక్క పక్కనే వున్నారు. కమల్ హాసన్ రాజకీయాలపై చేస్తున్న కామెంట్స్ ఆయన వ్యక్తిగతం. అభిప్రాయాలను వెల్లడించడంలో తప్పులేదు. 
 
కానీ రాజకీయాల్లోకి వచ్చేముందు ఆలోచించుకోవాలి. ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాం. సమస్యలను ఎలా పరిష్కరిస్తాం అనే విషయాలను బేరీజు వేసుకుని అడుగెత్తి పెట్టాలని.. అందుకే రజనీ, కమల్ ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందు బాగా ఆలోచించుకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని.. తద్వారా దేశాభివృద్ధికి అది తోడ్పడుతుందని గౌతమి వ్యాఖ్యానించింది.