శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:02 IST)

డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు గాయని గీతామాధురి భర్త...

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ మంగళవారంతో ముగియనుంది. సినీ ప్రముఖుల్లో చివరివాడైన గాయని గీతామాధురి భర్త నందు కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన తండ్రి, మేనమామతో కలసి సిట్ కార్యాలయానికి వచ్చాడు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ మొబైల్ ఫోన్‌లో నందు నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా జరిగిన వాట్స్ యాప్ సంభాషణల ఆధారంగా నందును విచారణకు పిలిపించిన అధికారులు, సుమారు 60 వరకూ ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగవచ్చని తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్, ఛార్మీ తదితరులు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.