మంగళవారం, 17 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (12:07 IST)

గోలీసోడా తెలుగు రిమేక్: లగడపాటి శ్రీధర్ సన్ విక్రమ్ సాయి హీరోగా..

తమిళంలో గత ఏడాది హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా గోలీసోడా. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా రైట్స్ లగడపాటి శ్రీధర్ చేతికొచ్చాయి.

ఆయన తెలుగుతోపాటు - కన్నడలోనూ సినిమాని తీయబోతున్నారు. తన కొడుకు విక్రమ్ సాయిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు లగడపాటి ప్రకటించారు. 
 
విక్రమ్ రేసుగుర్రం - రుద్రమదేవి లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా పరిచయం కానున్నాడు. గోలీసోడా టీనేజ్ కుర్రాళ్ల స్టోరీ. మరి తెలుగులోనూ తమిళంలోలాగే మేజిక్ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.