శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (11:48 IST)

`శుక్ర`లోని 'ఛోరా చకోర' పాటకు ఆద‌ర‌ణ‌

Chora Chakora song
అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా ''శుక్ర''. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. రుజల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, సంయుక్తంగా నిర్మించాయి. అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె నిర్మాతలు. ''శుక్ర'' సినిమాలోని మాస్ సాంగ్ ఛోరా చకోరా ఇటీవలే రిలీజైంది. ఈ మాస్ నెంబర్ లో చాందినీ భతిజ చేసిన డాన్సులు, ఎక్స్ ప్రెషన్స్ స్పెషల్ సాంగ్స్ కోరుకునే వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి.
 
మైండ్ గేమ్స్ నేపథ్యంలో ''శుక్ర'' ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో 'ఛోరా చకోర' పాట ఆడియెన్స్ కు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. పార్టీ మూడ్ లో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "శుక్ర" మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు  మధుర ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
 
Sukra Chora Chakora song
అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం - ఆశీర్వాద్, కాస్ట్యూమ్ డిజైనర్ - రియా పూర్వజ్, సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి, నిర్మాతలు - అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె, రచన దర్శకత్వం - సుకు పుర్వజ్